Waltair Veerayya Title Track: సంక్రాంతికి విడుదలయ్యే సినిమాల్లో మెగాస్టార్ చిరంజీవి వాల్తేరు వీరయ్య కూడా ఒకటి. మెగాస్టార్ చిరంజీవి అలాగే శృతిహాసన్ జంటగా వస్తున్న ఈ సినిమా షూటింగ్ కంప్లీట్ చేసుకుని ప్రమోషన్ కార్యక్రమాల్లో బిజీగా ఉంది టీం. ఇప్పటికే విడుదలైన రెండు పాటలు సినిమాపై అంచనాలను పెంచగా, ఈరోజు వాల్తేరు వీరయ్య టైటిల్ సాంగ్ విడుదల చేయడం జరిగింది.
Waltair Veerayya Title Track: చిరంజీవి సినిమా నుండి విడుదలైన ఈ టైటిల్ సాంగ్ మాస్ బీట్ తో అందర్నీ ఒక్క సారిగా కట్టిపడేసింది. ‘భగ భగ భగ మండే.. మగాడు వీడే’ అంటూ సాగుతున్న ఈ పాటను దేవీ శ్రీ ప్రసాద్, అనురాగ్ కులకర్ణి పాడారు. ప్రత్యర్థులపై యుద్ధం ప్రకటించినప్పుడు తన ఉగ్ర స్వభావాన్ని ప్రదర్శించే వాల్టెయిర్ వీరయ్యకు చద్రబోస్ సాహిత్యం అన్ని ఔన్నత్యాన్ని ఇస్తుంది.
గతంలో విడుదలైన రెండు పాటలకు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది, అయితే వాల్తేరు వీరయ్య టైటిల్ సాంగ్ మాత్రం చాలా కాలం పాటు అభిమానుల గుండెల్లో నిలిచిపోతుంది. విడుదలైన కొన్ని నిమిషాల్లోనే యూట్యూబ్ లో నెంబర్ వన్ పొజిషన్ లో ట్రెండ్ అవుతుంది ఈ టైటిల్ సాంగ్. ఈ చిత్రంలో రవితేజ అర్థమైన పాత్రల్లో చేస్తున్న విషయం తెలిసిందే.