Akhil Subsequent Mission After Agent: అఖిల్ అక్కినేని ప్రస్తుతం సురేందర్ రెడ్డి దర్శకత్వంలో ఏజెంట్ సినిమా షూటింగ్ కార్యక్రమాల్లో బిజీగా ఉన్నారు. అయితే ఏజెంట్ సినిమా చాలా రోజుల నుంచి షూటింగ్ జరుపుకుంటుంది. దర్శకుడు సురేందర్ రెడ్డి అఖిల్ ని ఈ సినిమాలో డిఫరెంట్ లుక్ లో చూపిస్తున్నాడు. అఖిల్ ఏజెంట్ సినిమా తర్వాత ఎవరి డైరెక్షన్ లో సినిమా చేస్తున్నాడు అనేది ఇక్కడ ప్రశ్న.
Akhil Subsequent Mission After Agent: వివరాల్లోకి వెళితే, ఈ ఏజెంట్ సినిమా కోసం అఖిల్ దాదాపు రెండు సంవత్సరాలు కేటాయించడం జరిగింది. తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో ఏ యంగ్ హీరో ఇన్ని సంవత్సరాలు ఒక సినిమా కోసం కేటాయించడం అంత మంచిది కాదని విశ్లేషకులు చెబుతున్నారు. దీని తరవాత అఖిల్ కొత్త దర్శకులతో చేస్తారా..? లేదంటే ఎలాంటి సినిమాలను లైన్లో పెట్టారనే కోషన్ కూడా విశ్లేషకులు వ్యక్తం చేస్తున్నారు.
అయితే దీనిపై క్లారిటీ రావాల్సి ఉంది. ఎందుకంటే అఖిల్ కూడా ఏజెంట్ సినిమా మీదే తన నమ్మకాన్ని పెట్టుకున్నారు. సురేందర్ రెడ్డి చాలా జాగ్రత్తలు తీసుకొని ఎక్కడ అంచనాలకు తగ్గకుండా చేస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ఏజెంట్ ఇద్దరూ అలాగే పోస్టర్లు సినిమా పై భారీ అంచనాలకు దిశగా తీసుకు వెళ్ళాయి.
మొదట్లో అఖిల్ సినిమా విషయంలో నాగార్జున జోక్యం చేసుకొని ఒక సినిమా తర్వాత ఇంకొకటి లైన్లో పెట్టేవారు. అయితే ఇప్పుడు అఖిల్ తన సొంత నిర్ణయాలతో ని సినిమాలో చేస్తున్నాడని తెలుస్తోంది. ఏజెంట్ తర్వాత కూడా అఖిల్ తనకు నచ్చిన కథలకే ఓకే చెబుతాడని టాక్. ఏజెంట్ సినిమా బాక్సాఫీస్ వద్ద హిట్ అయితే కనుక అఖిల్ రేంజ్ నెక్స్ట్ లెవెల్ లో ఉంటుంది. అలాగే డైరెక్టర్ ఎవరైనా సరే మళ్లీ మాస్ సినిమానే చేస్తాడట అఖిల్.