• Home
  • About Us
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms & Conditions
Monday, June 5, 2023
No Result
View All Result
Indian Buzz Today
  • Home
  • Global News
  • Startup & Business
  • Politics
  • Sports
  • Tech
  • Bollywood
  • Celebrities
  • Fashion
  • Lifestyle
  • Beauty
  • Home
  • Global News
  • Startup & Business
  • Politics
  • Sports
  • Tech
  • Bollywood
  • Celebrities
  • Fashion
  • Lifestyle
  • Beauty
No Result
View All Result
Indian Buzz Today
No Result
View All Result
Home Bollywood

Assessment: ఫీల్ గుడ్ భావన కలిగిస్తున్న అన్ని మంచి శకునములే చిత్రం..!!

by indianbuzz
May 20, 2023
in Bollywood
0
Assessment: ఫీల్ గుడ్ భావన కలిగిస్తున్న అన్ని మంచి శకునములే చిత్రం..!!
0
SHARES
0
VIEWS
Share on FacebookShare on Twitter


Anni Manchi Sakunamule Assessment In Telugu: రేటింగ్: 2.5/5 – నటీనటులు: సంతోష్ శోభన్,మాళవిక నాయర్,రావు రమేష్,రాజేంద్ర ప్రసాద్ – సంగీతం: మిక్కీ జే మేయర్ – నిర్మాణం: స్వప్న సినిమాస్,మిత్రవ్రింద మూవీస్ – కథ-దర్శకత్వం: నందిని రెడ్డి

Anni Manchi Sakunamule Assessment In Telugu: టాలీవుడ్ లో ఉన్న లేడీ డైరెక్టర్ చాలా తక్కువ మంది అని చెప్పవచ్చు. ఎప్పటికప్పుడు తన ప్రతిభను నిరూపించుకుంటూ అలా మొదలైంది చిత్రంతో మొదలుపెట్టిన తన కెరియర్ లో కల్యాణ వైభోగం మరియు ఓ బేబీ లాంటి వినూత్న చిత్రాలను అందించిన దర్శకురాలు నందిని రెడ్డి. సంతోష్ శోభన్ మరియు మాళవికా నాయర్ కాంబినేషన్లో ఆమె తెరకెక్కించిన కొత్త సినిమా అన్ని మంచి శకునములే ఈరోజు విడుదల అయింది. మరి ప్రేక్షకులను ఈ చిత్రం ఎంత మేరా మెప్పించిందో తెలుసుకుందాం…

కథ: ఎక్కడో హిల్ స్టేషన్ లో విక్టోరియాపురం అనే ఓ చిన్న పట్టణంలో…. ఒకే రోజు ఒకే హాస్పిటల్ లో రిషి (సంతోష్ శోభన్) మరియు ఆర్య(మాళవిక నాయర్) పుడతారు. అయితే అనుకోకుండా హాస్పిటల్లో జరిగిన తప్పిదం వల్ల ఇద్దరు పిల్లలు మారిపోయి వేర్వేరు ఇళ్లకు చేరుతారు. డాక్టర్ ఆ విషయం తర్వాత తెలుసుకున్నప్పటికీ చెప్పకుండా సైలెంట్ అయిపోతుంది. రిషి మరియు ఆర్య కుటుంబాల మధ్య కొన్ని ఆస్తి తగాదాలు.. కోర్టు కేసులు నడుస్తూ ఉంటాయి. వీటన్నిటి మధ్య కూడా వీళ్ళిద్దరూ ఒకే స్కూల్లో చదువుతూ స్నేహితుల్లా పెరుగుతారు.

అయితే రిషి చిన్నప్పటినుంచి ఆర్య ను ఇష్టపడిన చెప్పకుండా కాంగ్ గా ఉంటాడు. అనుకోకుండా బిజినెస్ ట్రిప్ లో భాగంగా యూరప్ కి వెళ్లిన ఈ ఇద్దరి మధ్య జరిగిన గొడవ కారణంగా కాస్త మనస్పర్ధలు తలెత్తుతాయి. తర్వాత ఆర్య వేరే అబ్బాయిని ఇష్టపడుతుంది. ఇక టు ఇయర్స్ గ్యాప్ తర్వాత ఈ ఇద్దరి మధ్య మళ్ళీ ఓ మీటింగు…ఈ రెండేళ్లలో వీళ్ళ బంధం ఎలాంటి మలుపు తిరిగింది, రెండు కుటుంబాల మధ్య ఆస్తి గొడవలు ఏమయ్యాయి, అసలు వీళ్ళిద్దరూ ఎవరు అనేది బయటపడిందా లేదా తెలియాలంటే తెరమీద చూడాల్సిందే.

విశ్లేషణ: సినిమా కాన్సెప్ట్ వైస్ పాతది అని చెప్పవచ్చు. ఒకే హాస్పిటల్లో ఒకేసారి పుట్టడం అనేది నువ్వే కావాలి మూవీ నుంచి చూస్తున్నాం. పిల్లల ఎక్స్చేంజ్ అనేది చాలా సినిమాల్లో రొటీన్ గా ఉన్నది. అయితే ఇక్కడ కథ పాతగా ఉన్న కథనం కాస్త ఇంట్రెస్టింగ్ గా ఉండడంతో ఎక్కడ బోర్ అనిపించలేదు. మంచి ఫీల్ గుడ్ మూడ్లో ప్రేక్షకులను ఆద్యంతం సినిమా ఆకట్టుకుంది.

స్టోరీ కాస్త నెమ్మదిగా ఉంది అన్న భావన కలిగిన పాత్రల మధ్య ఉన్న ఎమోషనల్ టచ్ మరియు కొన్ని సన్నివేశాలలోని కామెడీ మనల్ని ఎంగేజ్డ్ గా ఉంచుతుంది. చిత్రంలో ఎక్కడా ఎటువంటి అసభ్యత, హడావిడి లేకుండా.. ఏదో మన ఇంటి చుట్టుపక్కల జరిగే ఓ సింపుల్ స్టోరీ లాగా మనసుని కట్టిపడేస్తుంది. చాలా రోజులు తర్వాత వచ్చిన మంచి ఫ్యామిలీ ఎంటర్టైనర్ మూవీ గా దీన్ని చెప్పవచ్చు.

నందిని రెడ్డి స్టైల్ ఎలా ఉంటుంది అనేది కల్యాణ వైభోగం లాంటి మూవీస్ చూసిన వాళ్ళకి ఈజీగా అర్థమవుతుంది. చాలా సింపుల్ కాన్సెప్ట్స్ తో మన నిత్యజీవితంలో జరిగే చిన్న ఎలిమెంట్స్ ని కూడా మిస్ కాకుండా మూవీని మనసుకు హత్తుకునే విధంగా ఆహ్లాదంగా తెరకెక్కించడం నందిని స్పెషాలిటీ. ఆ టచ్ మరియు మ్యాజిక్ ఈ చిత్రంలో కూడా కనిపిస్తున్నాయి. అయితే ఈ మూవీలో నేరేషన్ కాస్త స్లో అవ్వడంతో పాటు ఎంటర్టైన్మెంట్ డోస్ తగ్గింది ఎందుకంటే ఎక్కువగా ఈ మూవీలో ఎమోషన్స్ మీద దృష్టి పెట్టడం జరిగింది.

– Commercial –

కొన్ని సీన్స్ పాతవైనప్పటికీ భావోద్వేగాలు పలికించడంలో నటీనటులు ఎక్సలెంట్ గా చేయడం వల్ల అవి హృదయానికి హత్తుకునే విధంగా ఉన్నాయి. మరీ పతాక సన్నివేశాలు అయితే అలా కట్టిపడేస్తాయని చెప్పవచ్చు. ఇటు హీరో హీరోయిన్ల మధ్య జరిగిన లవ్ ట్రాక్ కూడా ఎటువంటి డ్రామా మరియు అసభ్యత లేకుండా ప్రాక్టికల్ మరియు చాలా సింపుల్ లవ్ స్టోరీ లాగా సాగింది. నార్మల్గా సాగిపోయే సన్నివేశాలన్నాడు మా ఇద్దరి మధ్య ప్రేమ బయటపడినప్పుడు ప్రేక్షకులలో కూడా కదలిక తెప్పించటం నందిని పరిణీతికి ప్రమాణం.

అయితే హీరో హీరోయిన్ కుటుంబాల మధ్య జరిగిన ఆస్తి వ్యవహారం గొడవలు కాస్త సాగదీసినట్టుగా ఉన్నాయి. గొడవల ప్రస్తావన సినిమా అంతా ఉన్నప్పటికీ అసలు గొడవ ఎందుకు స్టార్ట్ అయింది అన్న విషయం పై పూర్తి క్లారిటీ ఇవ్వలేదు అనిపిస్తుంది. ఏదో కథలో ఉండాలి కాబట్టి బయటినుంచి తీసుకువచ్చి ఆ కాన్సెప్ట్ ని కథలో ఇరికించారా అన్న భావన కూడా కలగక మానదు. స్టోరీస్ లో అయినప్పటికీ మంచి క్లాసి ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా ఈ మూవీ చెప్పవచ్చు.

నటీనటులు: అన్నీ మంచి శకునములే మూవీలో అందరి నటుల అభినయం అద్భుతంగా ఉంది. మంచి పాత్రలు రాయడమే కాకుండా పాత్రకు తగిన నటుడిని ఎంచుకోవడం వల్ల పర్ఫామెన్స్ అద్భుతంగా ఉంది. హీరో సంతోష్ శోభన్ తన క్యారెక్టర్ లో ఎక్కడ కొంచెం కూడా అతి అనేది లేకుండా చాలా న్యాచురల్ గా నటించాడు. పెద్దగా ఏది ఆలోచించకుండా తనకు తోచినట్టుగా చేసుకుంటూ పోయే ఓ సామాన్య కుర్రాడి పాత్రల కు అతను 100% న్యాయం చేశాడు. ముఖ్యంగా లేదు లేదు అంటూనే హీరోయిన్ మీద దాచిపెట్టిన ప్రేమను బయట పెట్టే సన్నివేశం లో అతని నటన ఎక్స్ట్రార్డినరీ అని చెప్పవచ్చు.

మాళవిక నాయర్ యాక్షన్ ఈ మూవీకి మరో ప్లస్ పాయింట్. ఆర్య పాత్రకు ఆమె పర్ఫెక్ట్ ఛాయిస్ అయినప్పటికీ స్టార్టింగ్ లో చిన్నపిల్లగా చూపించడం కోసం కాస్త వెరైటీ మేకప్ ట్రై చేయడంతో కొంచెం ఎబౌట్ గా అనిపిస్తుంది కానీ మిగతా అన్ని సన్నివేశాలలో మాత్రం ఆమె అద్భుతంగా ఉంది. రాజేంద్ర ప్రసాద్ మరియు రావు రమేష్ తమదైన వినూత్నమైన శైలిలో నటించి అందరినీ మెప్పించారు. ఇటు నరేష్ మరియు గౌతమి కూడా వాళ్ల పాత్రలకు న్యాయం చేశారు. వెన్నెల కిషోర్ ఇంట్రడక్షన్ సీన్స్ లో బాగా నవ్వించినప్పటికీ సినిమా మొత్తం అతన్ని పెద్దగా ఉపయోగించుకోలేదు అని అనిపిస్తుంది.

ప్లస్ పాయింట్స్:

నటీనటుల యాక్షన్ ఈ చిత్రానికి స్ట్రాంగ్ ప్లస్ పాయింట్ అని చెప్పవచ్చు.

సినిమా అభ్యంతం ఆసక్తిగా మరియు ఓ ఫీల్ గుడ్ భావనను కలిగిస్తుంది.

మైనస్ పాయింట్స్: స్టోరీ కాస్త పాతగా ఉంది. – ముఖ్యంగా ఆస్తి గొడవ విషయం స్టోరీ కి అతికించినట్టుగా ఉంది.

చివరి మాట: కుటుంబ సమేతంగా ఆహ్లాదంగా ఎటువంటి హడావిడి లేకుండా ఓ మూవీ ని చూడాలి అన్న ఉద్దేశం నీకుంటే అన్నీ మంచి శకునములే మీకు బెస్ట్ ఛాయిస్ అవుతుంది. చిన్న పెద్ద అందరితో కలిసి ఎటువంటి అసభ్యకరమైనటువంటి సన్నివేశాలు లేకుండా కుటుంబంతో ఆనందించ తగిన నేటి తరం చిత్రం ఇది.

net title: Anni Manchi Sakunamule Assessment In Telugu, Santosh Sobhan, Malvika Nair, Anni Manchi Sakunamule telugu overview, Anni Manchi Sakunamule Assessment, AMS Assessment in Telugu



Source_link

indianbuzz

indianbuzz

Next Post
The Advantages Of Med Spa Therapies For Stress And Nervousness Administration

The Advantages Of Med Spa Therapies For Stress And Nervousness Administration

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Popular News

    Indian Buzz Today

    Welcome to Indian Buzz The goal of Indian Buzzis to give you the absolute best news sources for any topic! Our topics are carefully curated and constantly updated as we know the web moves fast so we try to as well.

    Category

    • Beauty
    • Bollywood
    • Celebrities
    • Fashion
    • Global News
    • Lifestyle
    • politics
    • Sports
    • Startup & Business
    • Tech

    Site Links

    • Home
    • About Us
    • Contact Us
    • Disclaimer
    • Privacy Policy
    • Terms & Conditions

    Recent Post

    • Superbon says loss on dwelling turf and getting knocked out makes him grasping for a win
    • Softmint Digital Providers Pvt Ltd
    • Excessive RAM Utilization on Home windows After Stopping Docker [Solved]

    Copyright © 2022 Indianbuzz.today | All Rights Reserved.

    No Result
    View All Result
    • Home
    • Global News
    • Startup & Business
    • Politics
    • Sports
    • Tech
    • Bollywood
    • Celebrities
    • Fashion
    • Lifestyle
    • Beauty

    Copyright © 2022 Indianbuzz.today | All Rights Reserved.